Home Page SliderNational

బైక్‌పై వరల్డ్ టూర్‌కు అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలలోనే కాదు, బయట కూడా రియల్ హీరో. సినిమాలలో చేసినట్లే బైక్‌పై రివ్వున దూసుకుపోగల గట్స్ ఉన్నవాడు. మంచి బైక్ రేసర్ కూడా. ఇప్పటికే తనకు రేసింగ్ ఇష్టమని చాలాసార్లు చెప్పారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడు బైక్‌పై టూర్లు కూడా వెళ్తుంటారు. ఈ మధ్యనే తన బైక్‌పై నేపాల్, భూటాన్‌లకు వెళ్లిన ఫొటోలు అభిమానులకు షేర్ చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ యాత్రకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం అజిత్ మేనేజర్ ధృవపరిచారు. ఇప్పటికే అజిత్ సాహసవంతమైన ఎన్నో టూర్లు చేశారని, కష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారని, త్వరలోనే వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. తన 62వ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని సమాచారం.