10న తెలంగాణకు ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీ రానుంది
టిజి: లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. పి.జె.కురియన్ నేతృత్వంలో రకిబుల్ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లతో కూడిన కమిటీ మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నేతలను కలిసి ఓటమికి కారణాలు, వారి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

