‘ఆయ్’ ట్రైలర్ రిలీజ్.. ఎన్టీఆర్ బావమరిది మళ్లీ హిట్ కొడతాడా..!
మ్యాడ్ సినిమాతో గతేడాది హిట్ కొట్టిన అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈసారి మరో ఫన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ఆయ్. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో తోస్తోంది. అయితే ఆయ్ మూవీ ట్రైలర్, పాటలు చూసిన ప్రేక్షకులు ఈ మూవీ యూత్‌ని బాగా ఆకట్టుకోబోతోందని చెబుతున్నారు. మరోవైపు ఆయ్ సినిమా గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండటం మూవీ విడుదల తర్వాత రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ వస్తుండటంతో మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లు చిత్ర యూనిట్ అలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అదేరోజు టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌తో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలు థియేటర్‌లు లేక కొట్టుకుంటుంటే ఈ మధ్యలోకి ఎన్టీఆర్ బావమరిది చిత్రం ఆయ్ వచ్చి చేరింది.
అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఆయ్ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తే ఈ సినిమాకు అదే ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఒకింత ఎక్కువ మొత్తం బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఆయ్ సినిమా ఇతర భాషల్లో సైతం విడుదలవుతుందేమో ఇంకా ఏమీ తెలియదు.

