అర్వింద్ పై దాడి టీఆర్ఎస్ పనేనన్న ఈటల
వరద సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఎంపీని పై దాడి చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో జరిగింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు పగిలిపోయాయి. దాంతో ఆయన కోరుట్ల వెళ్లిపోయారు. ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఇ ది ముమ్మాటికీ టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల పనేనని… వారి బెదిరింపులకు తాము లొంగమని ,దాడులకు భయపడేవాళ్లం కాదన్నారు ఈటల. టీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, అసహ్యించుకొంటున్నారని , ఈసంఘటన అమానవీయ ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు వారికి తగినబుద్ధి చెప్తారన్నారు ఈటల రాజేందర్.
