NationalNews

కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ఆఫ్తాబ్ పూనావాలా.. కేసులో కొత్త ట్విస్టు

భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత ఆఫ్తాబ్ పూనావాలాతో డేటింగ్ చేసిన యువత ఇప్పుడు భయాందోళనలో ఉందని పోలీసులు చెప్పారు. మొన్నటి వరకు ఆఫ్తాబ్ పేరు వింటే ఆనందం కలిగేదని.. శ్రద్ధ వాకర్ హత్య అతనే చేశాడని తెలిసిన తర్వాత… భయమేస్తోందంది. శ్రద్ధాను ఈ రకంగా చంపాడని తెలుసుకొని… షాకైయన్నాంటూ పోలీసులు ముందు కన్నీరుమున్నీరయ్యింది. హత్యా తర్వాత ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు రెండుసార్లు ఆమె వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. ఐతే అక్కడ మానవ శరీర భాగాలు ఉన్నట్లు తనకు తేలియదంది. అక్టోబరు 12న తనకు ఫ్యాన్సీ ఆర్టిఫిషియల్ రింగ్‌ని ఆఫ్తాబ్ బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. ఆ ఉంగరం శ్రద్ధకు చెందినదని పోలీసులు గుర్తించారు. ఆఫ్తాబ్ కొత్త స్నేహితురాలు నుండి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆమె వృత్తి రీత్యా మానసిక వైద్యురాలని విచారణలో తేలింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, అక్టోబర్‌లో రెండుసార్లు అఫ్తాబ్ ఫ్లాట్‌ను సందర్శించానని, అయితే హత్య గురించి లేదా ఇంట్లో శరీర భాగాలు ఉన్నాయనే దాని గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని ఆమె చెప్పింది.

ఆఫ్తాబ్ ఎప్పుడూ భయపడినట్లు కనిపించలేదని… తన ముంబై ఇంటి గురించి తరచూ చెప్పేవాడంది మానసిక వైద్యురాలు. ఆమెకు ఆఫ్తాబ్‌తో పరిచయం డేటింగ్ యాప్‌లో ఏర్పడిందంది. వివిధ డేటింగ్ సైట్ల ద్వారా అఫ్తాబ్ దాదాపు 15 నుంచి 20 మంది అమ్మాయిలతో పరిచయాలు పెంచుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు సమయంలో, పోలీసులు ఆఫ్తాబ్ బంబుల్ యాప్ రికార్డును తనిఖీ చేశారు. హత్య జరిగిన 12 రోజుల తర్వాత మే 30న పరిచయం చేసుకున్న మహిళను పోలీసులు కనుగొన్నారు. ఐతే ఆఫ్తాబ్ ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించలేదని… మానసికస్థితి కూడా మెరుగ్గానే ఉందని భావించానంది సదరు మహిళ. ఆఫ్తాబ్‌ డియోడరెంట్‌లు, పెర్ఫ్యూమ్‌ల ఎక్కువ కలెక్ట్ చేసేవాడని.. తనకు తరచుగా పెర్ఫ్యూమ్‌లను బహుమతిగా ఇచ్చేవాడని ఆమె చెప్పింది. ఆఫ్తాబ్ సిగరెట్లను పెద్ద ఎత్తున కాల్చేవాడని…ఐతే స్మోకింగ్ మానేయడం గురించి తరచుగా మాట్లాడేవాడంది. రకకాలల ఆహారాన్ని ఇష్టపడేవాడని… వివిధ రెస్టారెంట్ల నుండి మాంసాహార వస్తువులను ఆన్ లైన్ ఆర్డర్ చేసేవాడంది. హత్య కేసు వివరాలు బయటకు రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆమెకు ఇప్పుడు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.