Andhra PradeshHome Page Slider

బైక్ యాత్రపై తిరుపతి కొచ్చిన ఆదిపురుష్ మ్యూజిక్ డైరక్టర్

ఈ రోజు తిరుపతిలో వైభవంగా జరుగనున్న ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు మ్యూజిక్ డైరక్టర్ అతుల్ సరికొత్త రీతిలో విచ్చేశాడు. ముంబై నుండి బైక్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం సంగీతం ఇప్పటికే ప్రజలను అలరిస్తోంది. మూడేళ్లుగా స్టార్ హీరో ప్రభాస్ శ్రీరామునిగా నటించిన ఆదిపురుష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రీరిలీజ్‌కి అంతే స్థాయిలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.

ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని ఎస్.వీ. యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరగబోతోంది ఈ ఈవెంట్. ఈ చిత్రానికి తాను మ్యూజిక్ అందించడం తన అదృష్టమని, తిరుపతి శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో అదృష్టమని పేర్కొన్నాడు. దేవదేవుని ఆశీస్సులతో ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించాలని కోరుతున్నాడు.