డ్రగ్స్ అడ్డా…బెంగళూరు గడ్డ
కర్ణాటక లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ అక్రమరవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా , అబిగైల్ అడోనిస్ గా గుర్తించారు. ఢిల్లీ నుంచి MDMA అనే డ్రగ్ ను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే, వీరి నుంచి మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్టులతో పాటు రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

