Home Page SliderNational

రెండు పెద్ద సినిమాల రిలీజ్ రోజునే ఆయ్‌

పంద్రాగస్టుకి పోటీపడుతున్న రెండు పెద్ద సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా లైన్‌లో ఉంది. GA2 ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేసిన ‘ఆయ్’. ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ నార్నె, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంజి కె డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తిగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాను టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలిపాడు. తనకు అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, విద్యా కొప్పినీడిలకు ఆయ్ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆయన కోరాడు. ఆయ్ సినిమాతో నార్నె నితిన్, నయన్ సారికలకు మంచి హిట్ కొట్టాలని ఆయన కోరారు.

ఆయ్ సినిమాకు అల్లు అర్జున్ విషెస్ చెప్పడంతో ఈ సినిమాకు మంచి బూస్ట్ లభించిందని చెప్పాలి. ఇక బన్నీ తమకు విష్ చేసి చెప్పడంతో ఆయ్ చిత్ర యూనిట్ ఆయనకు థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు రామ్ మిర్యాల, అజయ్ అరసడ సంగీతాన్ని అందిస్తున్నారు.