అభాగ్యులకు అండగా ఆరా ఫౌండేషన్
సమాజానికి స్ఫూర్తి నివ్వడం కోసం చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. కొందరికి చిన్న పనులు… పెద్ద భవిష్యత్‌ను అందిస్తాయి. ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించేందుకు ఆరా ఫౌండేషన్ ఏర్పాటు చేసి చిలకలూరిపట్టణంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్. సొంత గ్రామంలో స్కూలును పునర్నిర్మించడమే కాదు.. పాఠశాలకు వసతి సౌకర్యాలు కల్పించారు ఆరా మస్తాన్… లక్షల రూపాయల వ్యయం చేసి పాఠశాలను అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా… ఎకరం స్థలాన్ని స్కూలుకు కానుకగా ఇచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాసులు ఇచ్చి ఔరా అన్పించుకున్నారు. ఇక విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి… అద్భుత ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అభాగ్యులకు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది ఆరా ఫౌండేషన్… ఆపన్నులకు చేయూతను అందించేందుకు ఎప్పుడూ ముందుండే ఆరా మస్తాన్… చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న వికలాంగుల కోసం ఒకేసారి మూడేళ్ల బస్ పాసులను ఒకేసారి అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ” గావ్ గావ్ చలో – ఘర్ ఘర్ చలో ” పండిట్ దీనదయాల్ జీ నినాదమే స్ఫూర్తిగా ముందుకు కదులుతున్నారు ఆరా మస్తాన్‌కు హృదయపూర్వక అభినందనలు చెబుదాం…
