Andhra PradeshHome Page Slider

సెల్ ఫోన్ మింగిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..?

సెల్ ఫోన్ మింగి ఓ మానసిక రోగి మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కీ ప్యాడ్ ఉన్న ఓ సెల్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్సలు చేసి సెల్ ఫోన్ తొలగించారు. అన్న వాహికకు సంబంధించిన ఈసో పేగస్ పూర్తిగా దెబ్బతినడంతో వైద్యుల సూచన మేరకు కాకినాడ జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. మరోవైపు తన కుమార్తె వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.