Home Page SliderTelangana

తెలంగాణాకు ‘అమిత్ షా’ రాక-కీలక సమావేశాలు

Share with

తెలంగాణాకు రేపు (బుధవారం )బీజేపీ ముఖ్యనేత, హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. నేడు ఎన్నికల కమీషన్ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎలక్షన్ జోరు మొదలయ్యింది. ఈ నేపథ్యంలో అమిత్‌షా రాష్ట్రానికి రావడంతో కీలక సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడింది. అమిత్ షా రేపు ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అనంతరం  హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చలు జరపబోతున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.