ప్రపంచ సుందరీమణులకు ఘనస్వాగతం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ ఉక్రెయిన్, మిస్ శ్రీలంక తదితర సుందరీమణులకు అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాల మధ్య హారతులు పట్టి సింధూరం దిద్ది స్వాగతించారు.

