ఫ్రాన్స్‌లో ప్రధాని మోదికి ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్రమోదీ రెండురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘన స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ఫోటోలతో ప్రధాని ట్వీట్ చేశారు. తన పర్యటనలో భారత్ –ఫ్రాన్స్‌ల పరస్పర భాగస్వామ్యానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రధానితో భేటీ అనంతరం సెనేట్‌ను దర్శించి, సెనేట్ అధ్యక్షునితో మాట్లాడుతారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ఎలీసీ ప్యాలెస్‌లో వారు ఏర్పాటు చేసిన ప్రైవేట్ విందులో పాల్గొంటారు. రేపు (శుక్రవారం) జరుగనున్న నేషనల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొంటారు. ఆయనతో పాటు భారత త్రివిధ దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.

