NewsTelangana

మెదక్ జిల్లా టీఆర్ఎస్‌లో కుదుపు

Share with

మెదక్ జిల్లా : నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎ‌స్ పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీ యాదవ్ ను పార్టీ సస్పెండ్‌ చేసింది. మురళీ యాదవ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు. మురళీ యాదవ్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని… పార్టీకి నష్టం కలిగిస్తున్నారని… అందుకే సస్పెండ్ చేశామన్నారు. పార్టీ సముచిత స్థానం కల్పించి భార్యభర్తలిద్దరికీ పదవులిచ్చినా ద్రోహం చేశారన్నారు. మనసులో ఏదో పెట్టుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.