ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం
నందమూరి తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల కాయిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తిగా వెండితో ఈ నాణెంను తయారు చేయాలని నిర్ణయించారు. ఈసందర్భంగా మింట్ అధికారులు నమూనాతో దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. దీనిపై సలహాలు, సూచనలు పురందేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అధికారులు చూపిన నాణెం మోడల్‌కు పురందేశ్వరి ఓకే అన్నారు. త్వరలో భారత ప్రభుత్వం రూ.100 నాణెం తీసుకువస్తోందని తెలుస్తోంది.

