Home Page SliderNational

జక్కన్నకు అరుదైన గౌరవం

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ RRR మూవీ సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుతోపాటు మరెన్నో గ్లోబల్ అవార్డులను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాతో తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి కాస్త గట్టిగానే చూపించారు రాజమౌళి. కాగా రాజమౌళి RRR సినిమాతో భారతదేశానికి ఎంతో కీర్తి,ప్రతిష్టలను అందించారు. ఈ విధంగా దేశ ప్రతిష్టను ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపినందుకుగాను దర్శకుడు రాజమౌళికి ఓ అరుదైన గౌరవం లభించింది. “ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్‌” సంస్థకు గౌరవ ఛైర్మన్‌గా ఆయన తాజాగా నియనితులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్లోని ప్రతిభను వెలికి తీయడం,క్రికెట్‌పై అవగాహన పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. కాగా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ గతేడాది దీన్ని ప్రారంభించారు.