విమానంలో ప్రయాణికుడికి గవర్నర్ చికిత్స
వృతి రీత్యా వైద్యురాలైన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అదించారు. శ్రుకవారం అర్ధరాత్రి దిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్ధకు గురి అయ్యారు.వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న తమిళసై అదే ప్లైట్‌లో ఉన్నారు.
విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు ఛాతీనొప్పి,ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్ధకు గురికావడంతో…విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైన డాక్టర్ లు ఉన్నరా అని అడిగారు.విషయం తెలుసుకున్న తమిళసై వేంటనే స్పందించారు.అ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు,భరోస ఇచ్చి ఉపసమనం కలిగించారు.కోలుకున్న ప్రయాణికుడు సహ విమానంలో ఉన్న వారంతా గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని తమిళసై అభినందించారు. అదే విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎం.బి.బి.ఎస్,ఎండీ,డీజీఓ లాంటి వైద్య కోర్సులు చేశారు.
Read more; పందుల నుండి కొత్తవ్యాధి -స్వైన్ ఫీవర్