పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ నేత
టీఆర్ఎస్ కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ మాజీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము కు సపోర్ట్ చేయకుండా గిరిజనుల పట్ల ఎంత చులకనగా వ్యవహరించిందని ఆయన విరుచుకుపడ్డారు. ముర్ము విషయంలో పార్టీ నిర్ణయంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. రాజీనామాను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భావానికి ముందు పార్టీ కోసం ఎంతగానే శ్రమించానన్నారు శ్రీరామచంద్రడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం… ఢిల్లీలో ఎంతగానో కృషి చేశానని.. ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Read more; ప్రమాదంలో ఉస్మానియా ఆస్పత్రి