NationalNews

పందుల నుండి కొత్తవ్యాధి -స్వైన్ ఫీవర్

Share with

దేశంలో కొత్తకొత్త వ్యాధులు కలవరం పుట్టిస్తున్నాయి. ఈమధ్యకాలంలో జంతువుల వల్ల సంక్రమించే వ్యాధులు ఎక్కువవుతున్నాయి.  కరోనా కేసుల పెరుగుదలతో పాటు మంకీపాక్స్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధులను తాజాగా కేరళలో గమనించారు. ఇప్పటికే 2 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా నిన్న మరొకరు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వ్యాధితో ఒక పందుల పెంపకం కేంద్రంలో 23 పందులు చనిపోయాయి. దానితో వయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలోని 2 పెంపకం కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను గుర్తించారు. దీనితో అప్రమత్తమై ఈ కేంద్రాలనుండి నమూనాలను భోపాల్‌లోని జాతీయ జంతు వ్యాధుల సంస్థకు పంపించగా వాటికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్థారించారు. దీనితో కేరళ పశుసంవర్థక శాఖ మంత్రి జె, చెంచురాణి పందులను, వాటి మాంసం ఉత్పత్తులను అమ్మడం, రవాణా చేయడం నిషేధించారు. రెండవ కేంద్రంలో ఉన్న 300 పందులను సంహరించాలని, వాటి మాంసాన్ని అమ్మరాదని నిర్ణయించారు. వాటిని చంపిన తర్వాత లోతైన గుంతలో పూడ్చిపెట్టాలని, ఇతర జంతువులకు ఈవ్యాధి సోకకుండా చూసుకోవాలని, ఆజ్ఞలు జారీచేసారు.

ఈఫీవర్ తొలుత 1921లో కెన్యాలో బయటపడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, అంగోలా మొదలగు దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌లలో కూడా వ్యాపించింది. ఈవ్యాధికి సంక్రమణ లక్షణం అధికంగా ఉంటుందని ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. వ్యాధి నియంత్రణకు కేంద్రప్రభుత్వం పాటించిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పందుల పెంపకందారులని ఆదేశించారు.