కాసేపట్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం
తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సమావేశానికి ఏపీలో సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ తో పాటు జేఏసీలోని 12 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈ భేటీలో కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతభేటిలో మ్యానిఫెస్టో పై పవన్ లోకేశ్‌ల మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కూడా మేనిఫెస్టో విడుదలపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే ఈరోజు జరిగే సమావేశంలో మ్యానిఫెస్టోకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తుది రూపుకు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ తో పాటు మరికొన్ని అంశాలతో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనలు చేసింది. ఇక మరోవైపు జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రతిపాదించింది. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత మేనిఫెస్టో పై ఒక తుది రూపు ఇవ్వ నున్నట్లు సమాచారం. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల దిశగా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి.


 
							 
							