కూలిపోయిన సొరంగం
నల్గొండ జిల్లా లో ఘోరం జరిగిపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వుతుండగా కూలిపోవడంతో పలువురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.శనివారం ఉదయం గనిలోకి వెళ్లి సొరంగమార్గంలో ఉన్న మైనింగ్ తవ్వుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.గత కొద్ది నెలల నుంచి ఎడమవైపు సొరంగంలో పనులను పూర్తిగా నిలిపివేసి సొరంగాన్ని మూసివేశారు.మళ్లీ ఇదే ప్రాంతంలో 4 రోజుల క్రితం పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.సహాయక చర్యలను ముమ్మరం చేశామని,మైనింగ్ అవశేషాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నామని మైనింగ్ అధికారులు వెల్లడించారు.

