తప్పుడు ఆరోపణలు చేస్తే కేటీఆర్ పై కేసు వేస్తా..
ఫాం హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఖండించారు. హైదరాబాద్ లో రూల్స్ ప్రకారమే ఫాం హౌస్ కట్టామని ఆయన అన్నారు. రూల్స్ ప్రకారం 30 మీటర్ల దూరంలో ఫాం హౌస్ నిర్మాణం చేపట్టమన్నారు వివేక్. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు చెబితే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి లోబడే పనులు జరిగాయన్నారు. ఎప్పుడూ చట్ట పరిధిలోనే ఉండి పనులు చేస్తానని.. నాకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం కోల్పోయామని బాధతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివేక్ హెచ్చరించారు.

