హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు
ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా? సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాలి? అంటూ హైకోర్టు…హైడ్రాకు అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో ఆదివారం… ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కి నోటీసులు జారీ చేసింది జస్టిస్ కె.లక్ష్మణ్ బెంచ్.దీంతో సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు మొట్టికాయలు ధర్మాసనం.

