Home Page SliderNational

మహాకుంభమేళాకు ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు ఇంకా తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబ సమేతంగా వెళ్లారు. కుటుంబంతో కలిసి బోట్ రైడ్‌ చేశారు. త్రివేణి సంగమానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదెలా ఉండగా భక్తుల తాకిడికి 350 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జాంలు అవుతున్నాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.