ఢిల్లీలో ముస్లిం నియోజకవర్గాల్లో కమలానికి ఆధిక్యం
గతంలో జరిగిన దాదాపు ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో బీజెపి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఇక అధికారం సంగతి అంటారా…ఆ ఊసే లేదు.ఇప్పుడు పరిస్థితి మారింది.ప్రజలు మారారు.వాతావరణ మార్పులు సంభవించాయి.ఇందులో భాగంగా ఓటర్లు కూడా తమ ఆలోచనా సరళిని మార్చుకున్నారు. ఢిల్లీ ఎన్నికలంటేనే ముస్లింల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది.మరి ఇలాంటి చోట్ల కూడా కమలం పార్టీ తమ కాషాయ జెండాను ఎగురవేయబోతుంది. ఢిల్లీలో అత్యధికులు నివశించే ముస్లింల స్థానాల్లోనూ బీజెపి జెండా రెపరెపలాడింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వార్ …చీపురు,కమలం మధ్యే జరిగింది.ఉదయం 9.30 గంటలకే బీజెపి 50 స్థానాల్లో,ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో మాత్రమే ఆధిక్యత కనబరిచింది.

