దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి..రేవంత్ రెడ్డి
దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి కులగణన చేసి, రికార్డు సృష్టించామని, పగడ్బందీగా సర్వే చేసి చాలా వేగంగా సమాచారం సేకరించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుండి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఇస్తున్నాం అని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ముందుకెళ్తాం అంటూ పేర్కొన్నారు. అలాగే మంత్రి వర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణ కుల గణన చేయడం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయవలసిందంటూ ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందన్నారు.

