పోలీసులపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తోందని, దానికి కొందరు పోలీస్ అధికారులు అడ్డాగా ఉన్నారని ఆరోపించారు. ‘వారిని వైసీపీ అధికారంలోకి రాగానే సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువచ్చి, దుస్తులూడదీసి బుద్ది చెప్తాం’. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి పోలీసు అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. కోళ్లదిన్నె గ్రామంలో దాడుల్లో గాయపడిన వైసీపీ నేత పల్లెబోయిన శ్రీనివాసులు రెడ్డిని ఆదివారం కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీని కలిసి, తమ వారిపై దాడులు చేసిన విషయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో పోలీసులపై ఇలా వ్యాఖ్యలు చేశారు.

