ఇది ఇల్లీగల్ కాదు – ప్రవీణ్
హైదరాబాద్ క్యాసినో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక వ్యక్తులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అనంతరం విచారణకు రావాలని ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్ వ్యక్తులతోనూ, ప్రముఖ రాజకీయ నాయకులతోనూ వారికి ఉండే సంబంధం గురించి ఆరా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈడీ విచారణ ముగించుకొని వచ్చిన అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటి నివృత్తి కోసమే తనను పిలిపించారని పేర్కొన్నారు. తాను చేసేది లీగల్ వ్యాపారమే అనీ, తానొక సామాన్య వ్యక్తినని చెప్పుకొచ్చారు. గోవా, నేపాల్‌లలో క్యాసినో లీగలేనని, తనకు ఏ ప్రముఖ వ్యక్తులతోనూ పరిచయాలు లేవని చెప్పారు. క్యాసినో వ్యాపారానికి సంబంధించిన ప్రశ్నలే ఈడీ అధికారులు అడిగారనీ మళ్లీ సోమవారం విచారణకు హాజరుకమ్మని ఆదేశించినట్లు తెలిపారు.
Read more: కాసినో కింగ్స్‌కు బడాబాబుల అండ