Home Page SliderTelangana

కౌశిక్ రెడ్డి తీరుపై వినూత్న రీతిలో కాంగ్రెస్ నిరసన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై యూత్ కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు, గాజులు, చీర పెట్టి గాడిదపై ఊరేగించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులను దూషించడం మానుకోవాలని, సంచలనాల కోసం మీడియా ముందు నోటి దురుసు ప్రదర్శించవద్దని హితవు పలికారు. ఇంకోసారి సీఎం, మంత్రుల జోలికి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హుజురాబాదులో కౌశిక్ రెడ్డిని అడుగడుగున అడ్డుకొని భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.