కొత్త రేషన్ కార్డులు అక్కడ మాత్రమే జారీ
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో కొన్ని నూతన మార్గదర్శకాలు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆ జిల్లాలలో రేషన్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉంటాయని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉంటుంది. మొదటి విడతగా ఎన్నికల కోడ్ అమలులో లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.