‘పుష్ప కా బాప్’ వీడియో వైరల్
‘పుష్ప’ మూవీతో దుమ్ము దులిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప కా బాప్’ అంటూ వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశారు. స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ కేక్ మీద ‘పుష్ప కా బాప్’ అని రాయించారు. హ్యాపీ బర్తడే డాడ్. మా జీవితాలు స్పెషల్‌గా మార్చినందుకు థాంక్యూ అంటూ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు.

