పెద్ద మనసు చేసుకొని క్షమించండన్న మహా గవర్నర్
రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. గుజరాతీలు , రాజస్ధానీలు ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారీతీసాయి. “ గుజరాతీలు , రాజస్ధానీలు మహరాష్ట్రను విడిచి వెళ్లిపోతే ముంబైకి డబ్బు ఉండదు “ అని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఓ కార్యక్రమంలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను పలు పార్టీలు ఖండించాయి. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందింస్తూ ‘గవర్నర్ హిందువుల మధ్య విభజన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నయన్నారు. ప్రభుత్వం ఆయనను ఇంటికి వెళ్లగొట్టాలా అన్న అంశంపై చర్చలు జరపాల్సిన సమయం వచ్చిందన్నారు. కోశ్యారీ కుర్చున్న స్ధానాన్ని గౌరవించడం కోసం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలో తెలియట్లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ముందు కోశ్యారీ క్షమాపణలు చేప్పాలని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కష్టపడి పని చేస్తూంటే ఇలా గవర్నర్ వారిని అవమానించడం సరికాదని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందింస్తూ .. గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతివ్వబోనని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వస్తూన్న విమర్మలపై స్పందించిన కోశ్యారీ , తన ప్రకటన తప్పుగా అర్ధం చేసుకున్నారని , మరాఠీ మాట్లాడే ప్రజల సహకారాన్ని కించ పరిచే ప్రశ్నే లేదని తెలిపారు. ఒక వర్గాన్ని ప్రశ్నించడం అంటే మరొక వర్గాన్ని కించపరచడం కాదని స్పష్టం చేసిన ఆయన శివసేన అద్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.