రంగంలోకి హైడ్రా బాహుబలి
అక్రమ హార్మ్యాలను సైతం అరక్షణంలో కూల్చివేయగల హైడ్రా బాహుబలి మిషన్ సోమవారం హైద్రాబాద్‌లోని మాదాపూర్ కు చేరుకోనుంది. అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేయనున్న భవనాల వద్దకు ఈ బాహుబలి మిషన్ చేరుకోనుంది.దీన్ని చూస్తేనే సగం అక్రమ నిర్మాణ దారుల గుండెలు కుంగిపోయేలా ఉంటాయి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత కోసం ఈ బాహుబలి మిషన్‌ని తెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 110 చెరువులను హైడ్రా అధికారులు జేసిబిలు,హైడ్రా లతో కూల్చివేశారు.రానున్న ఏడాదిలోపే 1102 చెరువులను స్వాధీనం చేసుకోబోతున్నామని హైడ్రా అధికారులు ప్రకటించారు.కాగా ఈ రోజు అయ్యప్ప సొసైటీ దగ్గర కూల్చివేయనున్న భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.నైబరింగ్ బిల్డింగ్స్‌కు ఇబ్బందులు లేకుండా కూల్చివేస్తారా అని అంతా ఉత్రంఠతో ఎదురుచూస్తున్నారు.
BREAKING NEWS: పాక్ సైనికుల్ని మట్టుబెట్టిన ఆత్మాహుతి దాడి..

