గర్భంలోని శిశువుకు హార్ట్ ఆపరేషన్
ప్రపంచంలోనే భారతీయ వైద్యులు గొప్ప ఘనత సాధించారు. ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా గర్భస్థ శిశువుకు విజయవంతంగా హార్ట్ ఆపరేషన్ చేసి రికార్డు సాధించారు రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు. 27 వారాల గర్భస్థ పిండానికి అయోర్టిక్ స్టెనోసిస్ అనే సమస్యను గుర్తించిన రెయిన్ బో ఆస్పత్రి చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రావు కోనేటి అరుదైన శస్త్రచికిత్స చేసి, ప్రాణం పోశారు. గతంలో ఇలాంటి సమస్యలు గుర్తిస్తే గర్భవిచ్ఛిత్తి మాత్రమే మార్గంగా ఉండేది. ఒకవేళ సమస్య ఆలస్యంగా గుర్తిస్తే బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే కన్నుమూసేది. ఇలాంటి పరిస్థితి రాకుండా వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి తల్లులకు కడుపు కోత తగ్గిస్తోంది.

