భాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
తమిళనాడు విరుద్ నగర్ జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది.బాణా సంచా గోడౌన్‌లో ఈ ప్రమాదం జరగడంతో ఆరుగురు కార్మికులు,సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమీపంలోని ఇళ్లకు బీటలు ఏర్పడ్డాయి.పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవన నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సత్తూర్ సమీపంలో ఉన్న ఓ బాణా సంచా ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.దాంతో ఫ్యాక్టరీ అంతా క్షణాల వ్యవధిలోనే మంటల్లో చిక్కుకుంది. అగ్నికీలలు ఆకాశాన్నంటేలా ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను మంటల నుంచి బయటకు తెప్పించారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యలు చేపడుతున్నారు.

