crimeHome Page SliderNationalNews Alert

‘మోదీ పీఏ మా నాన్నే’..ఘరానా జంట మోసం

ఒక ఘరానా జంట ప్రధాని మోదీ పర్సనల్ సెక్రటరీ పీకే మిశ్రా కుమార్తె, అల్లుడిగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారో జంట. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. అక్కడ ఇన్ఫోసిటీ ప్రాంతంలో వీరు విలాసవంతమైన ఆఫీసును నిర్వహిస్తున్నారు. ప్రముఖులతో ఉన్న ఫోటోలను చూపించి, తమకున్న పరిచయాలతో టెండర్లు ఇప్పిస్తామని హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులు పలువురు బిల్డర్లు, వ్యాపారులను మోసం చేశారు. వీరు ప్రధానంగా మైనింగ్, నిర్మాణ రంగాలకు చెందిన ధనవంతులను ట్రార్గెట్ చేసి, సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకుల భార్యగా చలామణీ అయ్యేది. వీరు ఇలా పలువురిని మోసం చేశారని పోలీసులు పేర్కొన్నారు. తాజాగా వీరిని అరెస్టు చేశారు. వీరివల్ల మోసపోయిన వారింకెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.