Home Page SliderTelanganatelangana,

కొత్త కోడలికి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్

Share with

హీరో నాగార్జున కాబోయే కొత్త కోడలు శోభితకు మంచి గిప్ట్ కొన్నట్లు సమాచారం. ఇటీవల రూ.2.5 కోట్లు పెట్టి కొన్న టయోటా లెక్సస్ వాహనాన్ని కాబోయే కోడలు శోభితకు గిఫ్ట్‌గా ఇస్తాడని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ ఆర్టీవో ఆఫీసుకు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున స్వయంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారు సెలబ్రిటీలకు ఇష్టమైన కారుగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి కారునే ఇటీవల రణబీర్ కపూర్ కూడా కొన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ నాగార్జున కానీ,, శోభిత కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే శోభిత తల్లిదండ్రులు కూడా నాగ చైతన్యకు భారీగానే కానుకలు ఇస్తున్నట్లు సమాచారం. చైతన్యకు ఆడికారు, స్పోర్ట్స్ బైక్, లగ్జరీ విల్లాను బహుమతిగా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్కినేని కుటుంబం తమకు డబ్బు ఆస్తులు వద్దని, తమ కొడుకుకి జీవితాంతం తోడుగా ఉంటే చాలని చెప్పారట.