స్టేషన్‌లోనే కాపురం పెట్టిన ఎస్ఐ
పనిచేసే చోట వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు చిక్కుల్లో పడ్డాడు ఓ ఎస్సై.అంతే కాదు ఆ మహిళ మోజులో భార్యబిడ్డలను సైతం తుదముట్టించాలనుకున్నాడు.ఈ విషయాన్ని భార్య బహిర్గతం చేయడంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా అదే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్నాడు. భార్యని వదిలేసి వసంత మత్తులో మునిగితేలుతున్నాడు.దీంతో విసిగి వేసారిపోయిన ఎస్సై భార్య జ్యోతి..ఎట్టకేలకు నోరువిప్పింది.తనకు జరుగుతున్న అన్యాయంపై మౌనం వీడింది.అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరి భాగోతాన్ని బయటపెట్టింది.తమని పట్టించుకోపోతే అక్రమ సంబంధం విషయాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో పిల్లలతో సహా తనని హత్య చేస్తానని తన భర్త బెదిరించారని మీడియా ముందు వాపోయింది.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.


 
							 
							