Breaking NewscrimeHome Page SliderTelangana

ఆ ఆరుగురికి బెయిల్ మంజూరు

సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితుల‌కు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయ‌మూర్తి ఉత్తర్వులిచ్చారు. సంథ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో చావుబ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్న శ్రీ‌తేజ్ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి ప్ర‌హ‌రీ గోడ దూకి వెళ్లి విధ్వంసం సృష్టించారు.రేవతి కుటుంబానికి రూ.20కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. వారంతా ఓయూ జెఏసి నాయ‌కులు..సీఎం రేవంత్ అనుచ‌రులుగా గుర్తించారు.ఆ 6గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేష‌న్‌కి త‌ర‌లించారు.వారిని తెల్ల‌వారు ఝామున జ‌డ్జి ముందు ప్రవేశ‌పెట్ట‌గా బెయిల్ ఇష్యూ చేశారు.