ఫోర్జరీ చేసి నగదు కాజేసిన సొసైటీ ఛైర్మన్
ఖమ్మం జిల్లాలో ఓ సొసైటీ ఛైర్మన్ చేతివాటం ప్రదర్శించాడు.తల్లాడకు చెందిన వేమిరెడ్డి పద్మావతి అనే మహిళకు సంబంధించిన ఎల్.ఐ.సి చెక్కుపై ఫోర్జరీ సంతకం చేసి దొరికిపోయాడు.ఆ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ సిబ్బందిని సైతం మోసం చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.సదరు మహిళకు రూ.1.50లక్షల చెక్కు ఎల్.ఐ.సి నుంచి అందింది.దాన్ని గుట్టు చప్పుడు విత్ డ్రా చేశాడు.తీరా పద్మావతి తన పేరుతో చెక్కు వచ్చిందని తెలిసి ఆరా తీస్తే…దాన్ని ఎప్పుడో డ్రా చేసుకున్నారని బ్యాంకు అధికారులు చెప్పారు.దీంతో తీగ లాగితే డొంక కదిలిన చందాన అనుమానం వచ్చి ఛైర్మన్ పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఆ సొసైటీ ఛైర్మన్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

