కంచె ఐలయ్యకు బిగ్ రిలీఫ్.. క్రిమినల్ కేసులన్నీ కొట్టివేత
ప్రొఫెసర్ కంచె ఐలయ్య కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఐలయ్యపై నమోదైన అన్ని క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. కంచె ఐలయ్య తరఫున శ్రీకాంత్ చింతల అనే న్యాయవాది క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదోపవాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఆయనపై నమోదైన కేసులన్నీ రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణ కిందకు వస్తాయని పేర్కొంది. అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ ఆ కేసులన్నింటిని కొట్టేసింది. ఆయన రాసిన ‘సామాజిక స్మగ్లర్లు -కోమ టోళ్లు’ అనే పుస్తకంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలపై కొందరు కేసులు పెట్టారు.

