Breaking NewscrimeHome Page Slider

పేలిన విద్యుత్ ట్రాన్స్పార్మ‌ర్‌

హైద్రాబాద్‌లోని కిష‌న్‌బాగ్‌లో ఓ విద్యుత్ ట్రాన్స్పార్మ‌ర్ పేలడంతో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.ట్రాన్స్పార్మ‌ర్ నుంచి ఒక్క‌సారిగా పెద్ద పేలుడు శ‌బ్దం రావ‌డంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో తోపుడు బండులు పెట్టుకుని జీవ‌నంసాగిస్తున్న‌వారు భ‌యంతో ప‌రుగులు తీశారు.దాదాపు 5 నిముషాల పాటు ట్రాన్స్పార్మ‌ర్ నుంచి నిప్పు ర‌వ్వ‌లు వ‌స్తూనే ఉన్నాయి.కొద్దిసేప‌టికి ట్రాన్స్పార్మ‌ర్ పేలిపోయింది.పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ప‌క్క‌నే ఉన్న తోపుడు బండ్లకు వ్యాపించాయి.ఈ ప్ర‌మాదంలో ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. దాదాపు 20కి పైగా తోపుడు బండ్లు అగ్నికి ఆహుత‌య్యాయి.పోలీసులు,విద్యుత్‌,గ్రేట‌ర్ హైద్రాబాద్ మున్సిప‌ల్ శాఖ‌ అధికారులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితి స‌మీక్షించారు.అగ్నిమాప‌క విప‌త్తుల స్పంద‌న శాఖాధికారులు వ‌చ్చి మంట‌ల‌ను నిలువ‌రించారు.ప్ర‌మాద ఘ‌ట‌న‌పై అధికారులు సంయుక్తంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.