Home Page SlidermoviesNationalNews Alert

రణబీర్, సాయిపల్లవిల ‘రామాయణ్‌’పై కొత్త అప్‌డేట్

రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ‘రామాయణ్’ చిత్ర విశేషాలపై హీరో రణబీర్ కపూర్ కొత్త అప్‌డేట్ పంచకున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం మొదటిభాగం ‘రామాయణ్‌’లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్  పూర్తయ్యిందని  పేర్కొన్నారు. చిన్నప్పటి నుండి రామాయణ కథను వింటూ పెరిగానని, రాముడి పాత్రలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప కథ రామాయణం అన్నారు. ఈ చిత్రంలో పురుషోత్తముడైన రాముడి పాత్ర కోసం ప్రత్యేక డైట్ ఫాలో అయినట్లు తెలిపారు. తన షూటింగ్ షెడ్యూల్ కాలంలో మద్యపానం మానేసినట్లు తెలిపారు. ఇక ఈ చిత్రంలో రావణునిగా యశ్, హనుమంతుడిగా సన్నీదియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నారు.  ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం విడుదల కావచ్చని సమాచారం.