బెనిఫిట్ షోలు రద్దు చేయండి..
పుష్ప-2 చిత్రం బెనిఫిట్ షోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ఎఫ్ఐ నేతలు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో నిన్న రాత్రి పుష్ప బెనిఫిట్ షో కారణంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలు రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని వారు సంధ్య థియేటర్ ముందు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో నెక్లస్ రోడ్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఇప్పటికే పుష్ప-2 చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ప్రకటించింది.

