రేవంత్ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది
అనుముల వారి అరాచకాలకు పాపం పండే రోజు ఎంతో దూరం లేదని,త్వరలోనే శిక్ష అనుభవిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డితో శనివారం ఆయన ములాఖత్ అయ్యారు. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత జైలు బయట నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లి వరకు అనుముల వారి కుటుంబీకులు సాగిస్తున్న అరాచకాలకు త్వరలోనే తెరపడనుందని జోస్యం చెప్పారు. రేవంత్ అనే నియంతకు వాతలు పడబోతున్నాయని చెప్పారు . రైతులను అతి కర్కశకంగా జైళ్లలో మగ్గబెడుతున్న రేవంత్ రెడ్డి దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు
BREAKING NEWS: భవిష్యత్తులో సాగు,తాగునీటి సమస్యలు లేకుండా చేస్తా-రేవంత్

