రౌడీ షీటర్‌కు వీఐపీ ట్రీట్మెంట్.. 7గురు పోలీసుల సస్పెన్షన్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు ఇచ్చిన వీఐపీ ట్రీట్మెంట్ కారణంగా అరగంటలో 7గురు పోలీసులు సస్పెండయ్యారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులో తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. కేసు విచారణ కోసం మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన పోలీసులు అతడిని దారిలో లగ్జరీ హోటల్‌కు తీసుకెళ్లి చికెన్, మటన్లతో నాన్ వెజ్ మీల్స్ పెట్టించారు. ఈ సంగతి పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీరియస్ అయ్యారు. రూల్స్ ప్రకారం పోలీసు వాహనంలోనే రిమాండ్ ఖైదీలకు ఆహారం ఇవ్వాలి. ఈ ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమల రావు అరగంటలో ఆ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

