“రాష్ట్రాలకు ఇదే చివరి ఛాన్స్”..సుప్రీం హెచ్చరిక
వలస కార్మికుల రేషన్ కార్డుల అంశంలో రాష్ట్రప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇక ఓపిక నశించిందని వ్యాఖ్యానించింది. 2020 కరోనా సమయంలో వలస కార్మికుల రేషన్ కార్డుల అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరిక చేసింది. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా దరకాస్తు చేసుకున్న 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీనితో ఈ జాప్యంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఇదే చివరి అవకాశం అని, నవంబర్ 19 లోగా తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర కార్యదర్శులు కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆహార భద్రత పథకం కింద కోటాతో సంబంధం లేకుండా ఈ రేషన్ కార్డులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.