Home Page SliderNational

రెజ్లర్ బబితా ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు

దంగల్ సినిమా టీమ్ పై రెజ్లర్ బబితా ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహవీర్ ఫొగాట్ కూతురైన గీతా ఫోగాట్, బబితా కుమారిల జీవిత కథ ఆధారంగా.. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన దంగల్ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల కలెక్షన్లు రాగా.. తమకు మాత్రం కోటి రూపాయలు కూడా ఇవ్వకపోవడంపై తాజాగా బబితా ఫొగాట్ అసహనం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఒక అకాడమీ నిర్మించేందుకు సహాయం కోరగా.. చిత్రబృందం పట్టించుకోలేదన్నారు. ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. అన్నివేల కోట్ల లాభం వచ్చినా.. తమకు చాలా తక్కువ మొత్తం ఇవ్వడాన్ని తప్పుబట్టారు.