Home Page SliderNational

చిరు సినిమాలో పవన్ వారసుడు..

మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖీరా నందన్ సినిమాల్లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. తన పెధనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో అఖిరా నటిస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ వారసుడుగా స్క్రీన్ మీద అకీరాను ఎప్పుడూ చూస్తామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన పార్ట్ షూటింగ్ లో అకీరా పాల్గొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అకీరా ఎంట్రీ గురించి ఓ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.