సీనియర్ నటి రాధిక సంచలన వ్యాఖ్యలు
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్న హేమ కమిటీ రిపోర్టుపై సీనియర్ నటి రాధిక స్పందించారు. కొంతమంది దుర్మార్గులు నటీమణులు రెడీ అవ్వడానికి వినియోగించే కార్వాన్‌లలో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జాడ్యం కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు, చాలా భాషలలో ఇండస్ట్రీలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రాధిక వ్యాఖ్యలు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో కలకలం రేపుతున్నాయి.

